పార్వతీపురం: గ్రామ పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలకు 50 లక్షల వరకు ప్రోత్సాహకాలు: జిల్లా కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏకగ్రీవ ఎన్నికయ్యే గ్రామాలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన 15 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు నిధులు అందనున్నాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఏకగ్రీవాలు చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు.