డోన్: బేతంచెర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరుమానుకొండ కి చెందిన వ్యక్తి మృతి
Dhone, Nandyal | Nov 13, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని గోరుమానుకొండ గ్రామానికి చెందిన కోడే విశ్వనాథ్ (37) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల మేరకు విశ్వనాథ్ గురువారం రాత్రి పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై ముద్దవరం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ ఢీకొట్టింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు.