హనుమకొండ: హన్మకొండలో ఘనంగా దీపావళి వేడుకలు: హామీలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హన్మకొండలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తనను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూ వరంగల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.