గిద్దలూరు: రాచర్లలోని రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు ఆహ్వానం అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం అధికారులకు వ్యక్తిగత కార్యాలయాలలో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరై ఆతిథ్యం స్వీకరించాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు.