గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో మహిళ ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామానికి చెందిన రాధ అనే మహిళ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బేతాపల్లి గ్రామానికి చెందిన రాధ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబసమస్యలతో బాధ పడుతుండేది. ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె జీవితం మీద విరక్తి చెంది విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.