మందమర్రి: మంచిర్యాల: కస్తూరిబా గాంధీ పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్
మంచిర్యాల జిల్లా నస్పూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య సందర్శించారు. పాఠశాల అభివృద్ధి పనులు, వసతి గృహాల నిర్వహణ, తాగునీటి సదుపాయాలను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.