జగ్గంపేట: జగ్గంపేటలో పోషణ మాసోత్సవం: అక్టోబర్ 8 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
జగ్గంపేట అంబేద్కర్ నగర్లో పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 8 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీడీపీఓ పూర్ణిమ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.