జడ్చర్ల: వల్లభరావుపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి నీటి గుంతలో మునిగి బాలుడు మృతి
ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోయి ఓ బాలుడు మృతిచెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. వల్లభరావుపల్లికి చెందిన రఘు కుమారుడు సాయి గ్రామ సమీపంలోని దుందుభి వాగుకు ఈత కోసం వెళ్లాడు. వాగు పక్కనే ఉన్న ఓ గుంతలో ఈతకు దిగగా.. ప్రమాదవశాత్తు మునిగి అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.