జడ్చర్ల: జడ్చర్ల సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఎసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మహబూబ్నగర్ ఎసీబీ డిఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరుtgb సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందం రంగంలో దిగి తనిఖీలు చేపట్టారు. మహబూబ్ నగర్ ఎసీబీ డిఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ.. జడ్చర్ల రిజిస్టర్ కార్యాలయంలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.