ఆళ్లగడ్డ: నల్లగట్ల గ్రామంలో తాగునీటి కటకట
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్ల గ్రామంలో ప్రస్తుతం వర్షాకాలంలో సైతం ప్రజలకు తాగునీటి సమస్య తప్పడం లేదు, నల్లగట్ల గ్రామంలో ఐదు రోజులుగా కులాలకు నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, నీటిసమస్య గురించి పంచాయతీ సెక్రెటరీ అడగగా డబ్బులు పెట్టుకొని మీరే బోర్ రిపేర్ చేయించుకోవాలని, ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాక ఇస్తామని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు