గుంతకల్లు: గుత్తి మండలం పూలకుంట శివారులో మూతబడిన కంకర క్రషర్ లో భార్యను చంపిన భర్త
మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త బండరాళ్లతో మోదీ కడతేర్చిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పూలకుంట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన శివలింగయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కె.లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే శివలింగయ్య కొనేళ్లగా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పూలకుంట దగ్గరకు తీసుకెళ్లి చంపాడు.