గజపతినగరం: గంట్యాడలో ఘనంగా ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గంట్యాడ శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయాధికారి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.