నర్సీపట్నం: నర్సీపట్నంలో అట్టహాసంగా బాలప్రతిభాపాటవ పోటీల ప్రారంభం
నర్సీపట్నంలో బాలల దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో 20వ జిల్లాస్థాయి బాలప్రతిభాపాటవ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి పాల్గొని విద్యార్థుల సృజనాత్మక కళాకృతులను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.