గజపతినగరం: 35 ఏళ్ల తర్వాత దత్తిరాజేరులో టీడీపీ జయభేరి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సక్సెస్!
35 ఏళ్ల పాటు ఇతర పార్టీల కంచుకోటగా ఉన్న దత్తిరాజేరును టీడీపీ కైవసం చేసుకుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో 16 ఎంపీటీసీలకు గాను 13 స్థానాలను కూటమి గెలుచుకుంది. నియోజకవర్గంలో చేపట్టిన రోడ్లు, తాగునీరు వంటి అభివృద్ధి పనులే ఈ చారిత్రక విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.