నరసరావుపేట: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శనార్థం వేలాదిగా తరలివచ్చిన భక్తులు
నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై కొలువై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకే బిందతీర్థంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ఆవరణం మొత్తం దివ్యానుమానంగా విరజిల్లుతుంది.ఆలయ ఈవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.తొలి ఏకాదశి పర్వదినంకి సంబంధించిన వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకుల్ వివరించారు.