నిడదవోలు: నిడదవోలు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణస్వీకారం: పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నూతన ఎంపీపీగా చదలవాడ నతానియేలు రాజు, వైస్ ఎంపీపీగా కొప్పిశెట్టి గాయత్రీదేవి ఎన్నికయ్యారు. అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.