వికారాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం: రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ రఘుపతిరెడ్డి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారితో గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా సెక్రెటరీ చామల రఘుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వికారాబాద్‌లో మంగళవారం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ విజయంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైందని, బూత్, గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు తమ శక్తికి మించి పనిచేసి అప్పగించిన ప్రతి కార్యాన్నీ విజయవంతం చేశారన్నారు.