వికారాబాద్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశాలకు బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానం: గిరిజన అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతి ప్రవేశాలకు వికారాబాద్ జిల్లా గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం తెలిపారు. మెుత్తం 6సీట్లు ఉన్నాయని, ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురకు అవకాశం కలదని వెల్లడించారు. మార్చి 4నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.