వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రామాల పరిధిలో, NREGS యంత్రాంగం కూలీల సంఖ్యను పెంచుతూ పనులు చేయించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.