పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె పోరాట స్ఫూర్తిని, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.