సూర్యాపేట: ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.