ఇల్లంతకుంట: కోతుల బెడదలతో ఇబ్బందులు పడుతున్న గ్రామం.. కోతుల బెడదను తీర్చిన వారికి తమ ఓటు అని చెప్పుతున్న యువకులు..
కోతుల బెడద తీరిస్తేనే ఓటు.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామ ప్రజలు కోతులతో విసిగి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూతులు మనుషులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. బయటికి వెళదామంటే కోతులతో వెంబలెత్తుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు.సోమవారం సాయంత్రం ప్రతి కుటుంబం నుంచి ఒక యువకుడు కర్ర తీసుకొని వచ్చి వానర సైన్యాన్ని తరిమివేయాలని గ్రామ పెద్దలు పిలుపునివ్వడంతో యువకులు ఏకమై కోతుల మందలను తరిమికొట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోతుల బెడదను తీర్చిన వారికే తమ ఓటు అని యువకులు తేల్చి చెప్పారు.