వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో రజక జన సమితి ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చేసిన పోరాటాలను, ఆత్మగౌరవం కోసం ఆమె ప్రదర్శించిన తెగువను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు.