కనిగిరి: పట్టణంలోని ఒకటవ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలోని ఒకటవ సచివాలయాన్ని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయానికి వచ్చిన ప్రజలను సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు అనంతరం సచివాలయంలోని పలు రికార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలని, విధులకు డుమ్మా కొట్టే సచివాలయ సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా చేస్తామని హెచ్చరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు.