కనిగిరి: పట్టణంలో రెవెన్యూ డే సందర్భంగా రెవిన్యూ ఉద్యోగుల భారీ ర్యాలీ, హాజరైన కనిగిరి డివిజన్లోని తహసిల్దార్లు, రెవిన్యూ సిబ్బంది
కనిగిరి పట్టణంలో రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం భార్య ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమాన్ని కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో రెవెన్యూ ఉద్యోగుల ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా రెవిన్యూ ఉద్యోగుల ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ... రెవెన్యూ ఉద్యోగులు తమ సమస్యలపై సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఉద్యోగులు ప్రజల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి డివిజన్ లోని 13 మండలాల తహసిల్దార్లు, రెవిన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.