కనిగిరి: యోగా సాధన ద్వారా విద్యార్థులు ఒత్తిడిని అధిగమించవచ్చు : కనిగిరి ఎంఈఓ నారాయణరెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ నారాయణరెడ్డి యోగా శిక్షకులచే విద్యార్థులకు యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు అన్నారు. యోగాతో పరీక్షల భయంతోపాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ... యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని, ఆసక్తి యోగాకు ఉందన్నారు.