గద్వాల్: గద్వాల: ర్యాలంపాడులో నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
గద్వాల జిల్లా ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో ఈనెల 24, 25, 26 తేదీలలో జరగనున్న బొడ్రాయి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారిని గ్రామ ప్రజలు ఆహ్వానించారు. మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.