మహబూబాబాద్: నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ మహాసభలు: 15న భారీ బహిరంగ సభ
నల్గొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు జరగనున్నాయి. 15న ఎన్జి కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ, 14న వ్యవసాయ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో జాతీయ స్థాయి రైతు నేతలు పాల్గొననున్నారు.