కొడిమ్యాల: జగిత్యాల: ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని కాపాడిన బ్లూకోట్స్ కానిస్టేబుల్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ అభినందించారు.