జనగాం: పెంబర్తిలో ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
జనగామ మండలంలోని పెంబర్తి లో ఐదుగురు పేకాట రాయుళ్లను జనగామ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.సీఐ దామోదర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు గురువారం పెంబర్తి మైదాన ప్రాంతంలో దాడులు నిర్వహించగా ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వారి వద్ద నుండి 5,690 నగదు,ఐదు సెల్ ఫోన్లు,3 బైకులను 14 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.