హనుమకొండ: హన్మకొండలో అక్రమ మందుల కేంద్రంపై దాడి, రూ.15 లక్షల విలువైన మందులు సీజ్
హన్మకొండ బాలసముద్రంలో డ్రగ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న చిప్రీక్స్ ఫార్మాపై అధికారులు దాడులు చేశారు. దాదాపు 15 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు ఏళ్లుగా అనుమతులు లేకుండా ఈ వ్యాపారం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.