నగరి: నిండ్ర మండలం కూనమరాజుపాళెం శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
నిండ్ర మండలం కూనమరాజుపాళెం శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ లక్ష్మీ నారాయణ హోమం నిర్వహించారు.