పార్వతీపురం: మట్టి విగ్రహాలనే పూజించండి: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపు
వినాయక చవితి వేడుకల్లో పర్యావరణాన్ని కాపాడేలా మట్టి విగ్రహాలను పూజించాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. సీతానగరంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు.