అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లాలో వేగవంతంగా భూముల రీ-సర్వే: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
నాగర్కర్నూల్ జిల్లాలో 70 గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ-సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని, గ్రామాల్లోని మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.