చిగురుమామిడి: చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించండి: సీఎంకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వాటిని కరువు మండలాలుగా ప్రకటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.