ప్రత్తిపాడు: అన్నవరం దేవస్థానంలో అధికారుల పర్యటన: భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
కార్తీకమాసం పర్వదినాల్లో అన్నవరం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ అధికారులు ఆదేశించారు. జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాధరావు, డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు, ఈవో విశ్వనాథరాజు పర్యవేక్షణలో దర్శనం, వసతి, తాగునీటి సదుపాయాలపై దృష్టి సారించారు.