మార్కాపురం: జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం మార్కెట్ యార్డు నుండి కంభం బస్టాండ్ వరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతానికి ఒక వరమని దీని ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్నారు. రైతులకు ఉద్యానవన మొక్కలతో మేలు జరుగుతుందన్నారు.