ఆర్మీ హవల్దార్కు కలెక్టర్ ఘన నివాళులు. బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ కువ్వారపు కిషన్ అస్సాంలో ఈ నెల 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, పోలీస్ అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు