గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం, అనంతపురంకు తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బేతాపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబ సమస్యలతో బాధ పడుతుండే వాడు. పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామాంజనేయులు జీవితం మీద విరక్తితో యంగన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.