గద్వాల్: ఇందిరమ్మ బీమా పథకం: కుటుంబ పెద్దలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా
ప్రభుత్వం త్వరలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' అమలు చేయనుంది. 18-59 ఏళ్ల వయసు గల కుటుంబ పెద్దలకు రూ. 5 లక్షల ఉచిత బీమా వర్తిస్తుంది. నవంబర్ 19లోపు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి ఈ ఆర్థిక సాయం అందుతుంది.