మార్కాపురం: పోస్ట్ ఆఫీస్ ద్వారా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి లడ్డు ప్రసాదం హోమ్ డెలివరీ : సూపర్డెంట్ శ్రీనివాసులు
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి లడ్డు ప్రసాదం భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి వద్దకే డెలివరీ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని మార్కాపురం పోస్టల్ డివిజన్ సూపర్డెంట్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఆలయానికి ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రసాదం బుక్ చేసుకోవచ్చన్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా హోమ్ డెలివరీ చేయబడుతుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.