మంచిర్యాల: భూముల రీ సర్వే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో భూముల రీ సర్వే, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురోగతిని సమీక్షించిన ఆయన, నిబంధనల ప్రకారం కేసులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.