మహబూబాబాద్: మహబూబాబాద్‌లో 60 లక్షలతో 18వ వార్డు నుంచి సీసీ రోడ్ పనులు మొదలయ్యాయి
మహబూబాబాద్ 18వ వార్డు బొడ్రాయి నుంచి ఎన్‌హెచ్ రోడ్డు వరకు రూ.60 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం ప్రారంభమైంది. ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో సౌకర్యాలు మెరుగుపడుతాయని తెలిపారు.