విశాఖపట్నం: మధురవాడ ఐటీ సెజ్ బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
మధురవాడ ఐటీ సెజ్ రుషికొండ తీరంలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అలల తాకిడికి గల్లంతయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా సరదాగా బీచ్‌కి వెళ్లిన ఆరుగురు బాలురిలో ముగ్గురు సముద్రంలో కొట్టుకుపోయారు. పోలీసులు, లైఫ్ గార్డ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు.