డోన్: అర్హులైన కూలీలందరికీ ఉపాధి హామీ పథకం : బేతంచర్ల లో నంద్యాల జిల్లా పిడి సూర్యనారాయణ
Dhone, Nandyal | Nov 13, 2026 గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి హామీ పథకం PD సూర్యనారాయణ సూచించారు. శుక్రవారం బేతంచెర్ల మండలంలోని గోరుమానుకొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం MPDO కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అర్హులైన కూలీలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సిబ్బంది కృషి చేయాలని ఆయన ఆదేశించారు.