భద్రాచలం: అర్ధరాత్రి రెండు ఆసుపత్రుల సమన్వయం.. కవల పిల్లల ప్రాణాలను కాపాడిన వైద్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల సమన్వయంతో ప్రమాదకర స్థితిలో ఉన్న కవల గర్భిణికి సురక్షిత ప్రసవం జరిగింది. మణుగూరులో తొలి బిడ్డ, భద్రాచలంలో రెండో బిడ్డ జన్మించగా, తల్లి మరియు ఇద్దరు శిశువులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.