కొత్తగూడెం: పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో.. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా.. సఫాయి మిత్ర భద్రతే- స్వచ్ఛతకు తొలిమెట్టు నినాదంతో
మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్.. ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ DRDO విద్యా చందన,DPO అనూష..
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ నిమిత్తం హెల్త్ క్యాంప్స్ వారికి అవసరమైన ఇన్సూరెన్స్ చేపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పాల్వంచ మండలంలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపును
జగన్నాధపురం రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్ బీపీ ఇతర అనారోగ్య సమస్యలను ప్రైమరీ హెల్త్ సెంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి ఆరోగ్య రక్షణ నిమిత్తం అవసరమైన ఇన్సూరెన్స్ స్కీములు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే హయ్యర్ హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తామని వివరించారు.