కరీంనగర్: కరీంనగర్ లో రూ. 1.15 కోట్లతో అభివృద్ధి పనులు: మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ నగరంలోని 3, 5వ డివిజన్లలో రూ. 1.15 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. త్రాగునీటి సమస్య, డంపింగ్ యార్డ్ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుంటూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.