నల్గొండ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి:CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం
నల్లగొండ జిల్లా: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం జూలై 9న జరిగే సమయం జయప్రదం చేయాలని బైక్ ర్యాలీని నిర్వహించారు. కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం చేపట్టిన తదనంతరం కార్మిక వర్గంపై కుట్ర పండుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.