నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం సమీపంలో జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న బైక్ దొంగతనానికి గురైంది. గ్రామానికి చెందిన వంశీ అనే అతను తమ పొలములో వ్యవసాయ పనులు చూసుకునేందుకు వెళ్తూ పొలం పక్కన స్కూటర్ ని నిలిపాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైకుని అపహారించుకొని ఎత్తుకెళ్లారు. తన స్కూటర్ దొంగతనానికి గురైన విషయం తెలిసి వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.